SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 మూవీపై భారీ అంచనాలున్నాయి. మొన్న మహేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఓ రేంజ్ లో సెన్సేషన్ అయింది. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒడిశా అడవుల్లో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడే భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ దట్టమైన అడవుల్లో క్రూరమైన హీగాల మధ్య ఒక ఛేజ్ సీన్ ఉంటుందంట. ఇది ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ను మించి ఇందులో ఇంటర్వెల్ సీన్ ను ప్లాన్ చేస్తున్నాడంట జక్కన్న
Read Also : Bigg Boss Agnipariksha Promo : ముఖానికి పేడ రాసుకున్న కంటెస్టెంట్.. ఇవేం పనులురా బాబు..
భారీ సింహాలతో ఈ సీన్ ను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం కొన్ని నెలల పాటు అక్కడే షూటింగ్ ను ప్లాన్ చేశాడంట జక్కన్న. మనకు తెలిసిందే కదా రాజమౌళి ఏదీ ఓ పట్టాన ఒప్పుకోడు. అది ఆయనకు నచ్చిన విధంగా వచ్చేదాకా దాన్ని వదిలిపెట్టడు. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ తాను అనుకున్నట్టు రావాల్సిందే. దాని కోసం ఎన్ని సార్లు అయినా రీ షూట్ చేసేస్తాడు. అందుకే రాజమౌళి సినిమాలపై ఆ రేంజ్ హైప్ ఉంటుంది. ఇక సింహాలతో సీన్లు.. పైగా భారీ ఇంటర్వెల్ సీన్లు ఉన్నాయి కాబట్టే జక్కన్న టైమ్ తీసుకుని ఈ సీన్లను అద్భుతంగా షూట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో మహేశ్ లుక్ నెవ్వర్ బిఫోర్ అన్నట్టే ఉంటుందంట. ఆ మధ్య సౌత్ ఆఫ్రికాకు వెళ్లి అక్కడి ఫేమస్ సింహాన్ని చూసి వచ్చాడు. దాన్ని కూడా ఇందులో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Chiranjeevi : చిరంజీవి పేరును అందుకే టైటిల్ గా పెట్టా.. అనిల్ కామెంట్స్