Sriram: శ్రీరామ్.. ఇప్పుడంటే ఈ హీరో.. ఒక నటుడిగా, విలన్ గా కనిపిస్తున్నాడేమో కానీ, ఒకప్పుడు శ్రీరామ్ అమ్మాయిలు మెచ్చిన కలల రాకుమారుడు. ఒకరికి ఒకరు సినిమాతో తెలుగుతెరకు పరిచయమై .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత శ్రీరామ్ నటించిన రోజా పూలు సినిమా కూడా హిట్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో కంటే తమిళ్ లో ఈ హీరో బాగా పేరు తెచ్చుకున్నాడు. కుర్ర హీరోలు రాజ్యం ఏలుతున్న సమయంలో.. హీరోగానే కాకుండా సపోర్టివ్ రోల్స్ చేస్తూ నటుడిగా మారాడు. ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో మెప్పిస్తున్న శ్రీరామ్.. పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శ్రీరామ్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీరామ్ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నాడు.
Animal : యానిమల్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
” మొదట్లో నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి ముందు గా నన్నే సంప్రదించారు. కానీ, అదే సమయంలో నేను ఒకరికి ఒకరు సినిమా ఒప్పుకున్నాను. అంతేకాకుండా అప్పుడు నా ఆరోగ్యం బాలేక ఫైట్స్ చేయలేని పరిస్థితి. అందుకే ఆ సినిమాను వదిలేసుకున్నాను. ఇక షూటింగ్ సమయంలో భూమిక చాలా గొడవలు అయ్యాయి. సాంగ్ సగంలో ఉన్నప్పుడు ఆమె సెట్ నుంచి పారిపోయింది. ఆ తరువాత ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే.. షూటింగ్ ఎలా జరిగింది అని నవ్వుతూ అడిగింది. ఆ సమయంలో భూమికను చంపేయాలనుకున్నాను.. కత్తి తీసుకొని అప్పుడే పొడిచేయాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మేము మాట్లాడుకున్నదే లేదు. ఈ మధ్యనే ఎక్కడో కలిస్తే మాట్లాడింది. అప్పటి సంఘటన తలుచుకొని నవ్వుకున్నాం కానీ, ఆరోజు మాత్రం ఎంతో కోపం వచ్చింది” అని చెప్పుకొచ్చాడు.