Sriram: శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు, రోజా పూలు లాంటి హిట్ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన ఈ హీరో.. చాలా గ్యాప్ తరువాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Sriram: శ్రీరామ్.. ఇప్పుడంటే ఈ హీరో.. ఒక నటుడిగా, విలన్ గా కనిపిస్తున్నాడేమో కానీ, ఒకప్పుడు శ్రీరామ్ అమ్మాయిలు మెచ్చిన కలల రాకుమారుడు. ఒకరికి ఒకరు సినిమాతో తెలుగుతెరకు పరిచయమై .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత శ్రీరామ్ నటించిన రోజా పూలు సినిమా కూడా హిట్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.