Kida: తొలి తమిళ చిత్రంతోనే ‘స్రవంతి’ రవికిషోర్కు గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kida: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్లో సుప్రసిద్ధ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా ‘కిడ’ ఒకటి. పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ హర్షం వ్యక్తం చేశారు.
Read Also: Like Share Subscribe: అక్క సినిమా కంటే ముందే వస్తున్న చెల్లి సినిమా!
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ.. ‘ఆర్ఏ వెంకట్ ఈ ‘కిడ’ కథను చెప్పినప్పుడు ఇందులో విషయం ఉందని అర్థమైంది. అందరికీ కనెక్ట్ అవుతుందని వెంటనే ఓకే చేశాను. ఇది పేరుకు తమిళ చిత్రమే. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా యూనివర్సల్ అయ్యింది. భాషలకు అతీతంగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏ భాషలో సినిమా తీసినా సరే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ అవుతుందనే ఉద్దేశంతో తమిళంలో తీశాం. మూడున్నర దశాబ్దాల స్రవంతి మూవీస్ ప్రయాణంలో తొలి తమిళ చిత్రమిది. తమిళనాడులోని మధురై జిల్లాలో కంబూర్ అనే కుగ్రామంలో ‘కిడ’ చిత్రీకరణ చేశాం. దీపావళి అందరికీ పెద్ద పండగ. ముఖ్యంగా తమిళ ప్రజలకు, అక్కడి చిన్నారులకు దీపావళి ఇంకా పెద్ద పండగ. పండక్కి కొత్త దుస్తులు కొనుక్కోవడం ఆనవాయితీ. పల్లెల్లో ఎవరైనా సరే తమ తాహతుకు మించి పిల్లలకు కొత్త దుస్తులు కొనివ్వాలని తాపత్రయపడుతుంటారు. కొనిచ్చిన తర్వాత తామే దుస్తులు ధరించినట్టు ఆనందపడతారు. ఆ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. మనవడి కోసం ఓ తాతయ్య తనకు తానే ఓ ఛాలెంజ్ విసురుకుంటాడు. ఆ ఛాలెంజ్ ఏమిటన్నది సినిమాలో చూడాలి. అది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసులను తాకే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – 2022లో ప్రదర్శనకు ఇండియన్ పనోరమా మా సినిమాను ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. తమిళం నుంచి ‘జై భీమ్’తో పాటు ‘కిడ’ను ఎంపిక చేయడం మరింత ఆనందకరంగా ఉంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అన్ని భాషల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో 53వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ను నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!