Like Share Subscribe: అక్క సినిమా కంటే ముందే వస్తున్న చెల్లి సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Like Share Subscribe Releasing On November 4: మెగా కాంపౌడ్ లోని అమ్మాయిలు కూడా ఇప్పుడు నిర్మాతలుగా రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తండ్రి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించడంతో పాటు నిర్మాతగా మారి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ వెబ్ సీరిస్ ను నిర్మించింది. ఆ తర్వాత ‘సేనాపతి’ అనే సినిమాను ఓటీటీ కోసం ప్రొడ్యూస్ చేసింది. అలానే ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే మూవీనీ నిర్మించింది. దీన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సరైన సమయం కోసం సుస్మిత కొణిదెల కొంతకాలంగా ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే… నాగబాబు కుమార్తె నిహారిక మాత్రం నిర్మాతగా అక్కను క్రాస్ చేసి ముందుకొచ్చేసింది. నటిగా ఓ పక్క గుర్తింపు సంపాదించుకుంటూనే నిహారిక చిత్ర నిర్మాణంలోనూ పాలుపంచుకుంటోంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లితో కలిసి ఆమె ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ మూవీ నిర్మించింది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 4న జనం ముందుకు రాబోతోంది.
Read Also: Janasena Party: విశాఖ జైలు నుంచి జనసేన నేతల విడుదల
Also Read
- Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
- Anirudh Ravichander: అనిరుధ్ సక్సెస్ వెనుక ఆ స్టార్ హీరో.. ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్!
- Payal Rajput : టాలీవుడ్‌ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్‌పై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!
- Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, ”ప్రభాస్ గారి చేతులు మీదగా ఈ నెల 25న ట్రైలర్ ను విడుదల చేస్తున్నాం. ప్రభాస్ అన్న ఫ్యాన్ గా ఇది నాకు చాలా ఎక్సయిటింగా వుంది. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన స్టోరీతో ‘ఏక్ మినీ కథ’ చేశాను. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం ఆనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా తో నటించడం హ్యాపీగా వుంది. బ్రహ్మజీ గారి పాత్రలోనే కాదు ఆయనతో షూటింగ్ లో కూడా చాలా ఫన్ ని ఎంజాయ్ చేశాం” అని చెప్పుకొచ్చారు. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, ” ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ జర్నీ ఒక అడ్వంచర్ లా జరిగింది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. నిహారిక ఎంటర్టైన్మెంట్ కి థాంక్స్. సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీ కి కృతజ్ఞతలు. బ్రహ్మాజీ తన పాత్రని చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా పట్ల చాలా ఎక్సయిటింగ్ వున్నాను. నా మొదటి సినిమా ‘జాతిరత్నాలు’ ని ఆదరించినట్లే ఈ సినిమాకి కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అని చెప్పింది.
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ”ఇదో ఫన్ రైడ్ లాంటి సినిమా. మంచి అడ్వంచరస్, థ్రిల్ ట్రిప్ లా వుంటుంది. ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ మూవీని ఎక్కడా రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో ట్రావెల్ వ్లోగ్గేర్ గా కనిపిస్తారు. అందుకే ఈ చిత్రానికి ఈ టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో సెకండ్ లీడ్ గా చాలా కీలకమైన పాత్ర వుంది. అది బ్రహ్మజీ గారు చేశారు. ఈ పాత్రలో ఆయన్ని తప్పా మరొకరిని ఊహించలేను. ఇది ఆయన చాలా డిఫరెంట్ రోల్. అలాగే సుదర్శన్, సప్తగిరి, నరేన్, మైమ్ గోపి ఇలా పెద్ద స్టార్ కాస్ట్ వుంది. ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది” అని అన్నారు. బ్రహ్మజీ మాట్లాడుతూ, ”’శ్యామ్ సింగారాయ్’ తీసిన వెంకట్ బోయనపల్లి గారు ఈ సినిమా తీసున్నారంటే ఈ కథ ఎంత బావుంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలా క్యాలిటీ వున్న సినిమా తీశారు. ఇందులో మనసుకు నచ్చిన పాత్ర చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు ప్రతి పదేళ్ళకు మంచి బ్రేక్ ఇచ్చే పాత్ర వస్తుంటుంది. అలాంటి బ్రేక్ వచ్చే పాత్రని ఇందులో చేశాను”’ అని అన్నారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ”సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా గొప్పగా తీశారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా గొప్పగా ఫెర్ ఫార్మ్ చేశారు. బ్రహ్మజీ గారు, సుదర్శన్, సప్తగిరి చాలా మంచి స్టార్ కాస్ట్ వుంది. ప్రేక్షకులు తప్పకుండా వినోదం పంచే సినిమా .. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్” అని చెప్పారు.
Read Also: Like Share Subscribe: అక్క సినిమా కంటే ముందే వస్తున్న చెల్లి సినిమా!
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..