బాహుబలి ఇండియన్ సినిమా ప్రైడ్. ఇది మా తెలుగోడి సత్తా అని కలర్ ఎగరేసి చెప్పగలిగిన సినిమా. తెలుగు సినిమా అంటే నాలుగు ఫైట్స్ ఆరు పాటలు అని చిన్న చూపు చూసే బాలీవుడ్ మేకర్స్ కు ముచ్చెమటలు పట్టించిన సినిమా. ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా. అంతటి సంచలనాలు నమోదు చేసిన బాహుబలి వెనక రాజమౌళి కష్టంతో పాటు ప్రభాస్ కష్టార్జితం, రానా రౌద్రం ఉంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా విడుదలై 2025 జులై 10 అనగా నేటికీ సరిగ్గా పదేళ్లు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. పదేళ్ల క్రితం విడుదలై వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది, అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుంది.
Also Read : Exclusive : ప్రభాస్ ‘రాజాసాబ్’ కు సీక్వెల్.?
మొదట ఈ సినిమాను ప్రకటించినపుడు ఇదేదో పీరియాడిక్ డ్రామా సినిమా అని తక్కువ అంచనా వేశారు. అటు మేకర్స్ కూడా ఫస్ట్ ఈ సినిమను రూ. 150 కోట్లతో ఒకటే సినిమాగా తీయాలని స్టార్ట్ చేసారు. కానీ షూటింగ్ జరుగుతున్న కొద్దీ ఈ కథను ఒక సినిమాగా చెప్పలేమని రెండు భాగాలుగా తీసేందుకు నిర్ణయించుకున్నారు. అలా బడ్జెట్ కాస్త రూ. 150 నుండి రూ. 250 కోట్లకు పెరిగింది. అటు ప్రభాస్ కూడా ఈ సినిమాతప్ప మరే సినిమా చేయకూడదని బల్క్ డేట్స్ ఇచ్చేసాడు. బాహుబలి పాత్ర కోసం 105 కిలోలు పెరిగి, శివుడి పాత్ర కోసం 85 కిలోలకు తగ్గారు. రానా 33 కిలోలకు పైగా బాడి పెంచేందుకు కఠోర శ్రమ చేశాడు. కత్తి సాము, గుర్రపు స్వారీ వంటి వాటిలో ప్రభాస్, రానా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శివగామి కోసం అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించగా ఆమె పెట్టిన రూల్స్ కు చిర్రెత్తుకొచ్చిన రాజమౌళి రమ్యకృష్ణను తీసుకుని ఆ పాత్రని అద్భుతంగా మలిచారు. కట్టప్పగా తమిళ నటుడు సత్యరాజ్ తీసుకున్నారు.
అలా మొదలై అనేక వ్యయప్రయాసలు కుర్చీ మొత్తానికి షూటింగ్ ముగించి 2015 జులై 10న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున బాహుబలి రిలీజ్ చేసారు. కానీ మొదటి రోజు ప్రీమియర్స్ నుండి USA, దుబాయ్, ఇతర కంట్రీస్ నుండి సూపర్ హిట్ టాక్. కానీ తెలుగు స్టేట్స్ నుండి బాహుబలి మిశ్రమ స్పందన రాబట్టింది. రూ. 40 కోట్ల డేఫిషెట్ లో రిలీజ్ అయిన బాహుబలికి రివ్యూస్ కూడా నెగిటివ్ వచ్చాయి. దాంతో బాహుబలి టీమ్ మొత్తానికి మైండ్ బ్లాంక్ అయింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆడియెన్స్ లో ఆదరణ పెరుగుతూ వచ్చింది. పది రోజులు రన్ తర్వాత బాహుబలి ప్రభంజనం సృష్టించి ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే సువర్ణ అక్షరాలతో తన పేరును లిఖించింది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన డార్క్ సైడ్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొందరు ఈ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకున్నారట. సినిమా అవుట్ ఫుట్ సరిగా రావట్లేదు ఎక్కువ పెట్టి కొనకండి అని డిస్టిబ్యూటర్స్ కు ఫీలర్స్ వదిలారట. రిలీజ్ రోజు కొందరు పనికట్టుకుని సినిమా యావరేజ్ అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేచేసారు. చాలా ఖర్చు పెట్టారు సినిమా ఆడాలని చెప్తూనే ప్లాప్ అవ్వాలనని కోరుకున్నారట. వాటన్నిటిని దాటి నిలబడిన బాహుబలి ఇండియన్ సినిమాకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆ తర్వాత ఎందరో బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టాలని అలాంటి సినిమాలు చేసి డిజాస్టర్స్ అందుకున్నారు. వారికి తెలియనిది ఏంటంటే ఎప్పటికైనా ‘బాహుబలి’ అనేది ఒక్కటే, రాజమౌళి అనేవాడు ఒక్కడే.