Regina Cassandra: ‘నేనే నా’ రైట్స్ సొంతం చేసుకున్న ఎస్.పి. సినిమాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nene Naa: యూనిక్ కంటెంట్ ప్రాజెక్ట్‌లు ప్రామెసింగ్ బ్రాండ్ నుంచి వస్తున్నపుడు ప్రేక్షకులు, ట్రేడ్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొంటుంది. ఎస్పీ సినిమాస్ తమిళ చిత్రసీమలో ప్రసిద్ధ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటిగా పేరు పొందింది. ప్రామెసింగ్ ప్రాజెక్ట్‌లను అందిస్తున్న ఎస్పీ సినిమాస్ తెలుగు పరిశ్రమలోకి తొలి అడుగు వేస్తోంది. రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో, ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో, ఆపిల్ ట్రీ స్టూడియోస్ రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన ‘నేనే నా’ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ అండ్ నాన్-థియేట్రికల్ రైట్స్ ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది.
Read Also: Shocking News : చనిపోయి ఆరేళ్లవుతోంది.. రెండేళ్ల కొడుకుతో ప్రత్యక్షం
Also Read
- Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా... "పోలీస్ కంప్లైంట్" డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
రాజ్ శేఖర్ ఇంతకుముందు సూపర్‌హిట్ చిత్రం ‘జాంబీ రెడ్డి’ని నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే చిత్రాలను అందించడంలో ఎస్పీ సినిమాస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలని ప్రమోట్ చేయడం, మార్కెట్ చేయడానికి సరైన వ్యూహాలను ప్లాన్ చేయడం, భారీ స్క్రీన్స్ అందించడంలో ఎస్పీ సినిమాస్ కి ప్రత్యేక విధానం ఉంది. ఎస్పీ సినిమాస్ గోల్డెన్ టచ్ ‘నేనే నా’కి విశేషమైన రీచ్‌ను అందిస్తుందని ఆపిల్ ట్రీ స్టూడియోస్ భావిస్తోంది.
ఇక ‘నేనే నా’ మూవీ విషయానికి వస్తే… ఇది 1920, ప్రజంట్ – రెండు విభిన్న కాలాల నేపథ్యంలో సెట్ చేయబడిన ఫాంటసీ-అడ్వెంచర్ థ్రిల్లర్. రెజీనా కసాండ్రా ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్రను పోషించింది. ఆమె కొన్ని ప్రత్యేకమైన పురాతన వస్తువులను వెలికితీసే సమయంలో మిస్టీరియస్ సంఘటనలు చోటు చేసుకుంటాయి. రెజినా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, అక్షర గౌడ, జయప్రకాష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘నేనే నా’ మూవీ ప్రేక్షకులకు సమ్మర్ ట్రీట్ కానుంది.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!