రెజీనా కసాండ్రా ప్రధాన పాత్ర పోషించిన 'నేనే నా' సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్, నాన్ థ్రియేట్రికల్ రైట్స్ ను తమిళనాడుకు చెందిన ఎస్.పి. సినిమాస్ సొంతం చేసుకుంది. వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రతి సినిమాకి తన నటనలోని నైపుణ్యాన్ని పెంచుకుంటూ వెళుతోంది హీరోయిన్ రెజీనా కసాండ్ర. ప్రస్తుతం ఆమె ‘నేనే… నా?’ చిత్రంలో రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తోంది. నిను వీడని నీడను నేనే వంటి హిట్ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. అలానే జాంబీరెడ్డితో సూపర్ హిట్ ను అందుకున్న రాజశేఖర్ వర్మ తన ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘నేనే…నా?’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ…