యాక్షన్, డ్రామా, హారర్, కామెడీ, లవ్… ఇలా ఏ జానర్ లో అయినా సినిమాలు చెయ్యొచ్చు కానీ సూపర్ హీరో జానర్ లో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇలాంటి సినిమాలు చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఏళ్ల తరబడి సమయం కేటాయించాలి… ఇన్ని చేసిన తర్వాత కూడా సరైన ఔట్పుట్ వస్తుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ సూపర్ హీరో సినిమాల వైపు అడుగులు వేయరు. హాలీవుడ్ లో బడ్జట్స్ ఉంటాయి, టైమ్ ఉంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు అందుకే అక్కడి నుంచి సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇండియన్ మూవీ లవర్స్ కూడా హాలీవుడ్ సూపర్ హీరోస్ ని బాగా ఆదరిస్తూ ఉంటారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఇండియాలో మన స్టార్ హీరోల సినిమాల రేంజులో కలెక్షన్స్ ని రాబట్టింది. ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మాన్, కెప్టెన్ అమెరికా… లాంటి సూపర్ హీరోలకి ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
ఇప్పుడు ఇండియాలో కూడా ఇండియా నుంచి కూడా సూపర్ హీరోలు వస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఇద్దరు సూపర్ హీరోలు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ కి ఇంప్రెస్ చేసారు. గతంలో మలయాళంలో రిలీజైన మిన్నల్ మురళి, ఇటీవలే తెలుగు నుంచి వచ్చిన హనుమాన్… ఈ రెండు సినిమాలు లో బడ్జట్ లో సాలిడ్ కంటెంట్ తో తెరకెక్కినవే. ఓవర్సీస్ ఆడియన్స్ ని కూడా ఈ ఇద్దరు సూపర్ హీరోలు ఆకట్టుకున్నారు. ఫ్యూచర్ లో ఈ సూపర్ హీరోలు ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకోవడం కోసం సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు మాత్రమే కాదు శివ కార్తికేయన్ నటించిన “మహావీరుడు”, రజినీకాంత్ “రోబో”, షారుఖ్ ఖాన్ నటించిన “రా.వన్” సినిమాలు సూపర్ హీరోల మోడ్ లోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాయి. ఈ చిత్రాలు ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి తెలిసేలా చేసాయి.