B. Hari Kumar: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు నెలల క్రితం కృష్ణంరాజు.. మూడు రోజుల క్రితం కృష్ణ మరణాలు చిత్ర పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇంకా వీరి మరణాలను జీర్ణించుకోక ముందే మరో నటుడు మృతి చెందాడు. మలయాళ నటుడు, రచయిత బి. హరి కుమార్ మృతి చెందారు. మలయాళంలో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న హరి కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేయగా.. చికిత్స పొందుతూ గురువారం ఆయన కన్నుమూశారు.
మాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన మొదట బ్యాంకు అధికారిగా పనిచేశారు. చిన్నతనం నుంచి నటనమీద ఉన్న మక్కువతో ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఇంకోపక్క సినిమా అవకాశాల కోసం తిరిగేవారు. ఇక తన మేనమామ, మలయాళ కమెడియన్ అదూర్ భాసీ సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హరి కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తపరుస్తున్నారు.