Student Suicide: కృష్ణా జిల్లాలో యువతి ఆత్మహత్య.. ఫోన్ చెక్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engineering First Year Student Commits Suicide Becuase Of Married Man Harassment: కృష్ణాజిల్లాలోని గన్నవరంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు తమ కూతురు సూసైడ్ చేసుకోవడాన్ని చూసి తల్లడిల్లిపోయారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ, ఇతరులనూ సంతోషపరిచే తమ అమ్మాయి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీటిపర్యంతం అయ్యారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనుకున్న తల్లిదండ్రులు.. అనుమానం వచ్చి, వెంటనే ఆమె ఫోన్‌ను పరిశీలించారు. అంతే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న ఓ వ్యక్తి.. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్టు ఆ యువతి పేరెంట్స్ గుర్తించారు. అతని వేధింపులు తాళలేకే, తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించుకున్నారు. దీంతో.. ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ఆరా తీశారు. అతడు గన్నవరంకి చెందిన వ్యక్తేనని తెలిసి, అతని ఆచూకీ తెలుసుకొని.. మృతురాలి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ‘‘బంగారం లాంటి తమ బిడ్డకు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి, పొట్టన పెట్టుకున్నావ్ కదరా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసి.. అతనికి తగిన శాస్తి చేశారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు అతడ్ని పోలీసులకు అప్పగించారు. ప్రేమ పేరుతో కూతుర్ని వేధించాడని, అతని వేధింపులు భరించలేక తమ కూతురు సూసైడ్ చేసుకుందంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
America Shooting: అమెరికాలోని రెండు నగరాల్లో కాల్పులు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!