యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై…శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ను రివీల్ చేశారు మేకర్స్. లెజెండ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
టాలీవుడ్ లో లెజెండ్ తరువాత విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ కి ఇది పెద్ద అవకాశమనే చెప్పాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం లక్ష్మణుడి భార్యగా సోనాల్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి. ఇకపోతే ప్రస్తుతం సోనాల్.. అక్కినేని నాగార్జున సరసన ఘోస్ట్ లో నటిస్తుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దుబాయ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు కొట్టేసిన ఈ భామ హిట్లను కూడా అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి.