బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. స్టార్ నటుడు శత్రుఘ్ను సిన్హా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక సోషల్ మీడియా లో అమ్మడు హాట్ షో లకు పెట్టింది పేరు అన్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. చేతికి డైమండ్ రింగ్ తో పక్కన కాబోయే భర్తతో నిలబడి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. అయితే తన ప్రియుడు ముఖాన్ని మాత్రం అమ్మడు చూపించలేదు. “ఇది నాకు బిగ్ డే.. ఈరోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటేఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను’ అని రాసుకొచ్చింది.
ఇక దీంతో అమ్మడికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అంత సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది..? ప్రియుడు ముఖాన్ని దాచాల్సిన అవసరం ఏంటి..? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇక సోనాక్షి ముఖం దాస్తే ఏంటి..? అతగాడెవరో మాకు తెలుసు అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. గత కొన్నిరోజుల నుంచి సోనాక్షి, జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ చేస్తున్న విషయం విదితమే. దీంతో ఆ వరుడు జహీర్ ఇక్బాల్ అని అంటున్నారు. ఇక మరికొందరు ఇదంతా ప్రమోషన్స్ స్టంట్.. నిశ్చితార్థం అయితే పేరెంట్స్ కూడా చెప్తారు కదా.. ఇలాంటివి చాలా చూశాం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది.