2018 నుంచి సినిమాలకి దూరంగా ఉన్న బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్… అయిదేళ్ల గ్యాప్ తర్వాత 2023లో పఠాన్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఒక పెద్ద ఫెస్టివల్ తీసుకోని వచ్చినట్లు, షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాని బాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకి తెచ్చాడు. ఈ స్పై యాక్షన్ సినిమా షారుఖ్ కి మాత్రమే కాదు కంబ్యాక్ కాదు మొత్తం బాలీవుడ్ కే ప్రాణం పోసింది. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. పఠాన్ గాలివాటం కాదు అని నిరూపిస్తూ షారుఖ్ జవాన్ సినిమాతో ఏకంగా 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసాడు. ఈ సినిమాలు షారుఖ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మరోసారి నిలబెట్టాయి. రెండు యాక్షన్ సినిమాలతో రెండు వేల కోట్లకి పైగా కలెక్ట్ చేసిన షారుఖ్ ఇప్పుడు, మాస్టర్ అఫ్ స్టోరీ టెల్లింగ్ రాజ్ కుమార్ హిరాణీతో కలిసి ‘డంకీ’ సినిమా చేసాడు. ఈ మూవీతో షారుఖ్ మరో వెయ్యి కోట్లు కొడతాడు అనే కాన్ఫిడెన్స్ ట్రేడ్ వర్గాల్లో ఉంది.
ఒక క్లాసిక్ చూడబోతున్నాం అనే హైప్ తో ‘డంకీ’ సినిమా ప్రమోషన్స్ జరిగాయి. ఈరోజు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి వచ్చిన ‘డంకీ’ సినిమా క్లాసిక్ గా నిలుస్తుందా? షారుఖ్ ఖాన్ కి హ్యాట్రిక్ వెయ్యి కోట్ల సినిమా అవుతుందా? రాజ్ కుమార్ హిరాణి తన మార్క్ సినిమా చేశాడా అనేది మరి కొన్ని గంటల్లో క్రిస్టల్ క్లియర్ గా తెలియనుంది. ఇప్పటికైతే సోషల్ మీడియాలో ‘డంకీ’ సినిమా క్లాసిక్ అని కొంతమంది, రాజ్ కుమార్ హిరాణి తన మ్యాజిక్ చూపించాడు అని కొంతమంది, జెమ్ ఆఫ్ బాలీవుడ్ అని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. అన్ని సెంటర్స్ లో షోస్ పడితే అసలు ఒరిజినల్ మౌత్ టాక్ ఏంటి అనేది తెలుస్తుంది.