Sobhita Dhulipala : నటి, నాగచైతన్య భార్య శోభిత భారీ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఆమె కొన్ని సినిమాలు చేసింది. కానీ పెద్దగా స్టార్ డమ్ రాలేదు. ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కొంత కాలం గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే సంచలన డైరెక్టర్ పా రంజిత్ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రంజిత్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సినిమాలు, కథ, వేషధారణ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. తంగలాన్ సినిమా చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది.
Read Also : Nithyananda: నిత్యానంద చనిపోయినట్లు పుకార్లు! క్లారిటీపై సందిగ్ధం
అందులో హీరోయిన్లను ఎలా చూపించాడో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నటుడు దినేశ్ హీరోగా చేస్తున్నాడు. ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో హీరోయిన్ గా శోభితను తీసుకుంటున్నారంట. పా రంజిత్ సినిమాలో హీరోయిన్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి శోభితకు ఇది మంచి గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. అదే జరిగితే పెళ్లి తర్వాత ఆమెకు లక్ కలిసివచ్చినట్టే అంటున్నారు.