వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు టాటా చెప్పి పూర్తి స్థాయిలో పొలిటీషియన్ గా మేకోవర్ కాబోతున్నాడు ఇళయ దళపతి విజయ్. అప్పటి లోగా తన చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘జననాయగన్’ ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నాడు. తొలుత ఈ భారీ బడ్జెట్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ఛేంజయ్యినట్లు టాక్.
Also Read : Trisha : త్రిష ఖాతాలో సెకండ్ వికెట్ డౌన్.. ఇలా అయితే ఎలా.?
రీసెంట్లీ రివీల్ చేసిన టైటిల్ పోస్టర్ లో అక్టోబర్ రిలీజ్ అని మెన్షన్ చేయకపోవడం అనుమానాలకు తావునిచ్చినట్లయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను తీసుకురావాలన్న యోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పుడు ఈ టాకే శివకార్తీకేయన్ కి ఇబ్బందికరంగా మారింది. విజయ్ సినిమా వాయిదా పడితే శివకార్తీకేయన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో అనుకోవచ్చు. శివకార్తీకేయన్- సుధాకొంగర దర్శకత్వంలో పరాశక్తి చేస్తున్నాడు. మోస్ట్ యాంటిసిపెటెడ్ చిత్రంగా మారిన ఈ సినిమా షూటింగ్ ఊహించిన దాని వేగంగా జరుపుకుంటోంది. పరాశక్తితో పాటు మురుగుదాస్ తో మరో ప్రాజెక్ట్ చేస్తోన్న అమరన్ హీరో ఈ రెండు ప్రాజెక్టులను సెప్టెంబర్, అక్టోబర్ నాటికి కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. సంక్రాంతికి పరాశక్తిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు జననాయగన్ కూడా నెక్ట్స్ పొంగల్ కు వస్తుందని తెలియడంతో పరాశక్తిని తీసుకురావాలా వద్దా అన్నయోచనలో పడింది యూనిట్. విజయ్ సినిమా సంక్రాంతికి వస్తే కాస్త గ్యాప్ ఇచ్చి పరాశక్తిని దింపాలని చూస్తున్నాడట ఎస్కే. ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగానే పరాశక్తి విడుదల తేదీ కన్ఫమ్ చెయ్యనుంది యూనిట్. మరీ దళపతి కోసం శివ సైడవుతాడో లేకుంటే పోటీగా సినిమాను తీసుకు వస్తాడో చూడాలి.