40 ప్లస్ లో కూడా యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా బిగ్ ప్రాజెక్ట్స్ బ్యాగ్ లో వేసుకుంటుంది త్రిష. ప్రజెంట్ అమ్మడి చేతిలో ఐదు బిగ్ ప్రాజెక్టులున్నాయి. తెలుగులో ఒకటి తమిళంలో 3, మలయాళంలో ఓ మూవీ చేస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోల చిత్రాలే. చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలకు కమిటయ్యింది.
Also Read : TOP 10 : రీరిలీజ్ లో కోట్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే
2025లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దింపి ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తుంది కానీ డెస్టినీ మరొకటి డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే మాలీవుడ్ నుండి ఐడెంటిటీ, కోలీవుడ్ నుంచి విదాముయార్చి వచ్చాయి. ఐడెంటిటీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఇప్పుడు అజిత్ మూవీ కూడా అదే బాటలో నడుస్తుంది. అజిత్ ఫ్యాన్స్ కు కూడా ఏ మాత్రం సినిమా ఎక్కట్లేదని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విదాముయార్చితో సెకండ్ ఫెయిల్యూర్ తన అకౌంట్ లో వేసుకుంది త్రిష. గతంలో అజిత్, త్రిష చేసిన సినిమాలన్నీ హిట్ కాగా ఆన్ స్రీన్ బెస్ట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. అందుకే ఆమెకు మరో రెండు ఛాన్సులిచ్చాడు అజిత్. అయితే ఈ సినిమా షెడ్డుకు వెళుతుందని ముందే తెలిసినట్లు ఉంది ప్రమోషన్స్ చేయలేదు. ఎవరు ఇంటర్వ్యూస్ ఇచిన దాఖలాలు లేవు. ఇక మేలో విశ్వంభర, జూన్ లో థగ్ లైఫ్ తో స్టార్లతో జోడీ కడుతుంది. ఈ స్టార్లతో గతంలోనూ జోడీ కట్టింది అమ్మడు. మరి మేడమ్ ఏ హీరోకు లేడీ లక్కుగా మారుతుందో ఫస్ట్ హిట్టు ఎప్పుడు అందుకుంటుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.