సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ‘సర్కారు వారి పాట’ సినిమాతో టాలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని “పెన్నీ” సాంగ్ ప్రోమోలో సితార కన్పించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అసలు సితార టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు ఇదొక సూపర్ సర్పైజ్ అని చెప్పాలి. ఎలాంటి చడీచప్పుడూ లేకుండానే సితార ఉన్న ప్రోమోను విడుదల చేసి సాంగ్ పై భారీగ హైప్ పెంచేశారు మేకర్స్. అయితే ‘పెన్నీ’ సాంగ్ లోకి సితార సడన్ ఎంట్రీకి కారణం ఏంటి? అనే డౌట్ వచ్చింది కొంతమందికి. అయితే దీని వెనుక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది.
Read Also : Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు
‘సర్కారు వారి పాట’ సినిమాకు సంగీతం దర్శకుడిగా వ్యవహరిస్తున్న తమన్ ‘కళావతి’ సాంగ్ కు సితార వేసిన స్టెప్పులు చూసి ఫిదా అయ్యాడట. ఇక ‘పెన్నీ’ సాంగ్ కోసం ఒక చిన్న పిల్లను తీసుకోవాలని అనుకున్న ఆయనకు సితార అయితే ఎలా ఉంటుంది ? అనే ఆలోచన వచ్చిందట. అనుకున్నదే తడవుగా మహేష్ కి విషయం చెప్పగా, ఆయన కూడా కూతురు ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంకేముంది ‘పెన్నీ’ పాట ప్రోమో విడుదల కాగానే సితార కంపించడంతో అప్రయత్నంగానే ఆమె డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.