Sitara Ghattamaneni: సాధారణంగా సెలబ్రిటీల వారసులు.. పెద్దయ్యాక.. మీడియాలో హైలైట్ అవుతారు. కానీ, ఘట్టమనేని గారాలపట్టీ సితార మాత్రం పుట్టడమే ఒక సెలబ్రిటిగా పుట్టింది. సితార పుట్టినరోజే.. మహేష్ తనను సోషల్ మీడియాలో చూపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక పెరిగేకొద్దీ నమ్రత.. సితూ పాపను అభిమానులకు దగ్గరగానే ఉంచుతూ వచ్చింది. నిజం చెప్పాలంటే.. మహేష్ కొడుకు గౌతమ్ తో ఉన్న ఫోటోల కన్నా.. సీతూతో మహేష్ ఉన్న ఫొటోలే ఎక్కువ. సెట్ లో కానీ, వెకేషన్ కు కానీ, సోషల్ మీడియాలో కానీ.. ఎక్కువ సితారనే కనిపిస్తూ ఉండేది. అందుకే సితారకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఇక 10 ఏళ్ళు కూడా నిండకుండానే.. సితార.. ఒక యూట్యూబ్ ఛానెల్ ను ఓపెన్ చేసి అందరి చేత ఔరా అనిపించింది. సీతూ పాప అంత యాక్టివ్ అని, ఆ అల్లరిని భరించలేమని మహేష్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక తను కనిపిస్తే.. పని మొత్తం మర్చిపోయి తనతో ఆడుకొనేవాడిని అని తెలిపాడు. అలా కళ్ళముందే సితార పెద్దది అయిపోయింది. ఈ మధ్య డ్యాన్స్ నేర్చుకుంటూ.. డ్యాన్స్ వీడియోలు కూడా పెడుతుంది. తన టాలెంట్ చూసి అభిమానులు వావ్ అంటున్నారు.
ఇక తాజాగా గతరాత్రి జరిగిన గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మహేష్ కన్నా.. సీతూపాప నే హైలైట్ గా మారింది. డెనిమ్ జీన్స్ స్కర్ట్ పై.. లాంగ్ స్లీవ్స్ టీషర్ట్ వేసుకొని,రింగుల జుట్టును ముడివేసి.. శ్రీలీల పక్కన కనిపించింది. ఇక శ్రీలీల ఎల్లో కలర్ చీరలో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగా.. సీతూపాప మాత్రం హాలీవుడ్ మోడల్ లా పోజ్ ఇచ్చి మెస్మరైజ్ చేసింది. ఈ ఫొటోల్లో అస్సలు శ్రీలీల కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు.. ఈ చిన్నారి హాలీవుడ్ మోడల్ లా పోజులు ఇవ్వడం చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి భవిష్యత్తులో సితార .. హీరోయిన్ గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి.