Sitara Gattamaneni: ఘట్టమనేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ సంపాదించుకున్న లెగసీని ఆయన తనయుడు మహేష్ బాబు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఘట్టమనేని కోడలిగా నమ్రత తాన్ బాధ్యతలను తాను నిర్వర్తిస్తోంది. ఇక వీరి గురించి పక్కన పెడితే ఘట్టమనేని మూడుతరం చాలా కలర్ ఫుల్ గా ఉండబోతోంది అంటే అతిశయోక్తి కాదు. మహేష్ ముద్దుల తనయ సితార చిన్నతనం నుంచే తన ట్యాలెంట్ తో మహేష్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఇక తాజాగా చెల్లికి అక్క తోడైంది. అదేనండి.. మహేష్ అన్న రమేష్ కూతురు భారతి ఘట్టమనేని. కృష్ణ మృతి తరువాత భారతి, ఆమెఅన్న జయరామ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెల్సిందే.
ఇక తాజాగా అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. నిత్యం సితార ఏదో ఒక ఇంగ్లిష్ సాంగ్ కు తనదైన రీతిలో స్టెప్పులు వేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఈసారి సితారతో పాటు భారతి కూడా జాయిన్ అయ్యింది. హాలీవుడ్ సాంగ్ కు ఈ అక్కాచెల్లెళ్లు వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. సూపర్, క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు హీరోయిన్ అవ్వడానికి సితారకు కొంచెం టైమ్ ఉంది.. భారతి అయితే హీరోయిన్ గా ట్రై చేయొచ్చు అని చెప్పుకొస్తున్నారు. మరి భారతి ముందు ముందు ఏమైనా తాత, తండ్రి, బాబాయ్ ల నట వారసత్వం పుచ్చుకొని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.