తెలుగులో ఘన విజయం సాధించిన ‘సీతారామం’ ఇప్పుడు బాలీవుడ్ లో సందడి చేయటానికి సిద్ధం అవుతోంది. తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంట ఇప్పుడు ఉత్తరాది వారిని మలయమారుతంలా తాకబోతోంది. వైజయంతి మూవీస్ సంస్థ హను రాఘవపూడి దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఒకే సారి విడుదల అయింది.
ఇప్పుడు సెప్టెంబర్ 2న బాలీవుడ్ లో రిలీజ్ కాబోతోంది. దుల్కర్, మృణాల్ తో పాటు రష్మిక కూడా బాలీవుడ్ ఆడియన్స్ కి తెలిసినవారే కావటంతో పాటు మ్యూజికల్ లవ్ స్టోరీగా ఘన విజయం సాధించటం బాగా కలసి వచ్చే అంశం. బాలీవుడ్ చక్కటి ప్రేమకథా చిత్రాన్ని చూసి చాలా కాలం అవటంతో ఉత్తరాదిలోనూ ఘనవిజయం తథ్యం అనే భావన అందరిలోనూ ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లో పట్టం కట్టినట్లుగానే బాలీవుడ్ కూడా ‘సీతారామం’ సినిమాకు అద్భుత విజయంతో స్వాగతం పలుకుతుందని ఆశిద్దాం.