ప్రముఖ సింగర్ సునీత ఇటీవలే రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. మొదటి వివాహం గూర్చి మాట్లాడుతూ.. ‘ప్రతి టీనేజ్ అమ్మాయి తన జీవితం గురించి ఎన్నో కలలుకంటుంది. తన జీవితం అందమైన నవలలా ఉండాలని, తాను ఎక్కువగా ప్రేమించబడాలని కోరుకుంటూ ఊహల్లో బ్రతికేస్తోంది. తాను కూడా అందరి మాదిరే అలాంటి కలలే కన్నానని తెలిపింది.. అయితే, తన మొదటి పెళ్లి తర్వాత తనకు ఎన్నో విషయాలు తెలిసొచ్చాయని, అసలు జీవితమంటే ఏమిటో అర్థమైందని చెప్పుకొచ్చింది. మొదటి వివాహం బ్రేకప్ తర్వాత రామ్‌తో పెళ్లి జరిగే వరకూ సుమారు 15 సంవత్సరాలపాటు ఎన్నో సమస్యలను, కష్టాలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నాను అంటూ తెలిపింది. నాకు తగిలిన దెబ్బలకు మనుషుల్ని నమ్మడం కూడా మానేశాను’ అంటూ సునీత చెప్పుకొచ్చింది.