Kenisha : తమిళ హీరో జయంరవి, ఆయన భార్య ఆర్తి వ్యవహారం సంచలనంగా మారిపోయింది. ఇద్దరూ. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జయంరవికి సింగర్ కెనీషాతో రిలేషన్ ఉందని.. ఆమె వల్ల తమ కాపురం కూలిపోయిందంటూ ఆర్తి సంచలన ఆరోపణలు చేస్తోంది. అటు కెనీషా తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారంటూ రీసెంట్ గానే ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ తెలిపింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈమె.
Read Also : Virat Kohli: కోహ్లీని కలిసిన జహీర్.. ఆ ఫోన్లో ఏముంది..?
తనను బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై, తనను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె టీమ్ తెలిపింది. ఇన్ స్టాలో వస్తున్న అసభ్యకరమైన కామెంట్లు, అశ్లీల పోస్టులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె టీమ్ చెబుతోంది. సైబర్ క్రైమ్ తో పాటు సిటీ పోలీస్ లను ఆశ్రయిస్తామని చెబుతున్నారు. జయం రవి భార్య ఆరోపణలు చేసినప్పటి నుంచి సింగర్ కెనీషా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం జయంరవి విడాకుల కేసు కోర్టులో ఉంది.
అటు ఆర్తితో పాటు ఆమె అమ్మ వరుసగా జయంరవిపై ఆరోపణలు చేస్తున్నారు. అతని వల్ల తమ జీవితాలు నాశనం అయ్యాయంటూ చెబుతున్నారు. జయంరవి తమకు ఇష్టం లేకపోయినా విడాకులు ఇస్తున్నారంటూ ఆర్తి చెబుతోంది. మొత్తానికి జయం రవి వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. సింగర్ కెనీషా కూడా బయట కనిపించట్లేదు.
Read Also : PM Modi: మోడీతో పోరాడటం ఇంత కష్టమని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించి ఉండరు..