Jr NTR: కాలర్ ఎగరేసుకునేలా దేవర.. డైలాగ్ లీక్ చేసిన ఎన్టీఆర్.. సిద్ధూకి హ్యాట్సాఫ్ చెబుతూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Leaks Devara Dialouge and Raises Expectaions: టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ముందుగా తన అభిమానులకు సిద్దు జొన్నలగడ్డ అభిమానులకు నమస్కారాలు తెలియజేశాడు. అలాగే మీడియాకి మిగతా ప్రేక్షకులందరికీ నమస్కారం అంటూ ఆయన స్పీచ్ మొదలుపెట్టాడు. సిద్దు నటించిన చాలా సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ ఎప్పుడూ పర్సనల్గా ఇంట్రాక్ట్ అవ్వలేదు. కరోనా తర్వాతే సిద్దుతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధూ. తనకి సినిమా తప్ప వేరే ఏమీ తెలియదు. డీజే టిల్లు అనే క్యారెక్టర్ ని చూసి బేసిగ్గా సిద్దు ఇలాగే ఉంటాడేమో అని మీరు అనుకోవచ్చు తన పర్సనల్ లైఫ్ లో అని కానీ సిద్దు అలా ఉండడు.
Trivikram: ఇది దేవర నామ సంవత్సరం.. 1000 కోట్ల కలెక్షన్స్.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
తనకు ఎంతసేపు సినిమా, తను చేస్తున్నటువంటి క్యారెక్టర్, తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ, ఆ కథకు నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన. చాలా తక్కువ మంది నటీనటులు లేదా టెక్నీషియన్స్ లో ఈ తపనను చూస్తాం. సిద్దు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ ని కాదు మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ మనకి ఇచ్చాడు. చాలా సార్లు అనుకునేవాడిని, నేను చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ బాగా చూసేవాడిని, పాపాయి, హిమాన్ అనే కార్టూన్స్ చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్లు మన జీవితంలో కేవలం సినిమాల రూపంలో మిగిలిపోతే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని, అలాగే ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు. టిల్లు కేవలం ఒక సిద్దు జొన్నలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు.
ఈ రోజు హాట్సాఫ్ సిద్దు జొన్నలగడ్డ, హ్యాట్సాఫ్ టు డిజె టిల్లు టీం, అండ్ టిల్లు స్క్వేర్ టీం. మన ఇంట్లో ఉండిపోయి మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు, మీ అందరికీ హాట్సాఫ్. నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిగ్గా నేను నవ్వడం మొదలు పెడితే దాన్ని ఆపుకోవడం చాల కష్టం. నేను అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ చాలా కష్టపడేవాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనను చూస్తేనే నాకు నవ్వు వచ్చేసేది. అరవింద సమేత షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇదే త్రివిక్రమ్ గారు కూడా ఫేస్ చేశారు అలాంటిది నేనింకా నవ్వలేను బాబోయ్ అనే అంతలా నవ్వించాడు సిద్దు.
నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్దుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి. మనందరికీ అందించాలని, భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ గురించి చెప్పను. కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం ఉంటుంది. కలగనే ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని, ఆకలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి అని ఒక డైలాగ్ చెప్పారు.. అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు, ఐ యాం టెల్లింగ్ దట్ అంటూ నవ్వులు పూయించారు. అనంతరం పోలే అదిరి పోలే అంటూ త్రివిక్రమ్ ని నవ్వించాడు. దేవర అనే సినిమా లేట్ అయినా మీ అందరూ కాలర్ ఎగరేసుకునేలా అందిస్తామని అంటూ ఆయన ముగించారు.
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!