యంగ్ అండ్ హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనతికాలంలోనే గుర్తింపు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సిద్ధు అంతలోనే కిందపడిపోయాడు. ఆఫర్ తగ్గిపోయాయి. కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.మళ్లీ ఇప్పుడిప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి అరకోర సినిమాలు చేస్తున్నాడు. కానీ తన సినిమాలను ప్రేక్షకులు వీక్షించడం పూర్తిగా తగ్గించారు. ఒక హిట్ కొట్టడం అతనికి గగనంగా మారింది.దీంతో సిద్దు హీరో గానే కాకుండా కొంత కాలంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. నోరు జారి ఏదో ఒకటి అనడం వార్తల్లో నిలవడం.. అతనికి అదే పనిగా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలు ఇరుక్కున్న సిద్ధార్థ్ తాజాగా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్న అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
Also Read: Aryan Khan: ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ఎస్.ఎస్. రాజమౌళి..?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ ‘నాకు ఓ అరుదైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి అభిమానుల వల్లే వచ్చింది. చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ట్ డం కోసం పాకులాడుతూ ఉంటారు. నేను కూడా అలాగే చేశాను. కానీ స్టార్డం వచ్చాక నా అభిమానుల వల్ల నేను ఓ వ్యాధి బారిన పడ్డాను. చాలా మంది హీరోలు స్టార్డం వస్తే దాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ నేను మాత్రం ఎంజాయ్ చేయాల్సిన టైం లో ఇబ్బందులు పడ్డాను.చాలా మంది ఫ్యాన్స్ నన్ను ఫాలో చేస్తూ నాతో మాట్లాడడానికి తెగ ఆసక్తి చూపించేవారు. కానీ నాకు మాత్రం వారితో మాట్లాడాలి అంటే చాలా టెన్షన్ వచ్చేది.అలా ఎందుకు జరుగుతుంది అని డాక్టర్‌ను సంప్రదించాను. అప్పుడే వారు నాకున్న పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ అనే ఆశ్చర్యకరమైన వ్యాధి గురించి బయట పెట్టారు. ఈ వ్యాధి కారణంగా చాలా రోజులు ఇబ్బంది పడ్డాను. కోలుకోవడానికి నాకు ఏకంగా 7,8 సంవత్సరాలు పట్టింది’ అని చెప్పుకొచ్చాడు. ఇక హీరో మాటలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.