ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ ఒకప్పుడు తన అందంతో చర్చల్లో ఉండేది. కానీ తాజాగా ఇచ్చిన ఓ స్టేట్మెంట్ తో వివాదాన్ని కొనితెచ్చుకుంది. భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్వేతా తివారీ ఒక ప్రకటనతో మతపరమైన మనోభావాలను దెబ్బ తీసింది అంటూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ‘ఏది చెప్పినా ఎవరినీ నొప్పించాలని నేను ఎప్పుడూ అనుకోను. నా కామెంట్ ను ఇలా తీసుకుంటారని నేను అనుకోలేదు. ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు” అంటూ అందరికి క్షమాపణలు చెప్పింది. పైగా తాను దేవుడిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, శ్రీకృష్ణుడిగా పాపులర్ అయిన తన సహనటుడిని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అన్నానని చెప్పుకొచ్చింది. మహాభారత టీవీ సీరియల్‌లో శ్రీకృష్ణుడి పాత్రతో పాపులర్ అయిన సౌరభ్ రాజ్ జైన్, శ్వేతా తివారీ జంటగా ‘షో స్టాపర్’ అనే వెబ్ సిరీస్‌లో చేస్తున్నారు.
Read Also : కాజోల్ కు కరోనా… మొహం చూపించలేనంటున్న బ్యూటీ !
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌కు సంబంధించి ఇటీవల ఆమె భోపాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సిరీస్‌లో అతనితో పాటు సౌరభ్ రాజ్ జైన్ కూడా ఉన్నాడు. మీడియా సమావేశంలో దేవుడు నా బ్రా సైజు తీస్తున్నాడని శ్వేతా చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్వేతపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. అయితే ఈ విషయం శ్వేత దృష్టికి రావడంతో ఆమె క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది.