Coolie : లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాకు మంచి బజ్ ఉండటంతో ఇప్పటికీ వరుసగా టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే శృతిహాసన్ ఇందులో ప్రీతి పాత్రలో కనిపించింది. ఆమె పాత్రపై ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రీతి లాంటి పాత్ర ఇవ్వడం నిజంగా అన్యాయమే అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా శృతిహాసన్ ఆస్క్ మీ సంథింగ్ అంటూ ఆన్ లైన్ లో ఓ సెషన్ నిర్వహించింది. ఇది చూసిన ఓ నెటిజన్ ప్రీతి పాత్ర ఇవ్వడం అన్యాయం అనిపించలేదా అంటూ ప్రశ్నించాడు.
Read Also : Kajol : హీరోయిన్ బాడీపై చెత్త వీడియో.. ఫైర్ అయిన నటి..
దానిపై శృతిహాసన్ మాట్లాడుతూ.. నాకు అలా అనిపించలేదు. నిజంగా చెప్పాలంటే అది చాలా షేడ్స్ ఉన్న పాత్ర. అది నాకు బాగా నచ్చింది. అయినా ఆ పాత్ర ఎలా డిజైన్ చేయాలన్నది నా చేతుల్లో లేదు. అంతా డైరెక్టర్ ఇష్టం. ఇప్పటి వరకు అలాంటి పాత్ర నేను చేయలేదు. ఆ పాత్ర మహిళలకు బాగా నచ్చుతుంది. అందుకే అందులో నటించాను. అదొక్కటే ఆ పాత్రలో నాకు నచ్చిన అంశం. ఇలాంటి పాత్ర నాకు నిజంగా చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. కాగా కూలీ ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇందులో సైమన్ పాత్రలో నాగార్జున నటించిన విషయం తెలిసిందే. ఇందులోని అన్ని పాత్రలు బాగున్నాయి.
Read Also : Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..