ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అలాంటిది బర్త్ డే అంటే… సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఆ రోజు ప్రభాస్ సినిమాల నుంచి సాలిడ్ అప్డేట్స్ బయటికి రాబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు రెండు సినిమాల అప్డేట్స్ మాత్రమే రానున్నాయని వినిపించింది కానీ ఇప్పుడు… డార్లింగ్ డబుల్ కాదు ట్రిపుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ బర్త్ డే గిఫ్ట్‌గా ‘సలార్’ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. ట్రైలర్ కట్‌కు రెడీ అవుతున్నట్టుగా టాక్. దీంతో పాటు… నాగ్ అశ్విన్ ‘కల్కి’ నుంచి బిగ్ సర్ప్రైజ్ ఉంటుందని చెబుతున్నారు.
Read Also: Bhagavanth Kesari: ఇట్స్ సింహం రోరింగ్ టైమ్… బిగ్ ఈవెంట్ లోడింగ్!
ఇక అనౌన్స్మెంట్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న మారుతి సినిమా నుంచి కచ్చితంగా ఏదో ఒక సర్ ప్రైజ్ ఉంటుందని అంటున్నారు కానీ ప్రభాస్ మాత్రం బర్త్ డేకి ఇండియాకు రావడం లేదని తెలుస్తోంది. పుట్టిన రోజు వేడుకలు విదేశాల్లోనే ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం డార్లింగ్ మోకాలి సర్జరీ కారణంగా విదేశాల్లోనే ఉన్నాడు. అందుకే… ఫారిన్‌లోనే బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నట్టుగా సన్నిహితుల వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ప్రభాస్ ఫ్రెండ్స్ ఫారిన్‌కు రావాల్సిందిగా… ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా చెబుతున్నారు. సో ప్రభాస్ బర్త్ డేకి హైదరాబాద్ రావట్లేదు కానీ బర్త్ డే రోజున సినిమాల అప్డేట్స్ మాత్రం అదిరిపోయే రేంజులో బయటకి రానున్నాయి.