నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మొత్తం ‘అఖండ’ మేనియా నడుస్తోంది. విదేశాల్లో సైతం బాలయ్య ఫీవర్ పట్టుకుంది. సినిమాలో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్, అలాగే తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని సోషల్ మీడియా టాక్. బాలయ్య, బోయపాటి ఈ ‘అఖండ’మైన విజయంతో హ్యాట్రిక్ హిట్ ను తమ ఖాతాల్లో వేసుకున్నారు. బ్లాక్ బస్టర్ కాంబో కాకుండా ఈ సినిమాకు మరో మెయిన్ అసెట్ థమన్. ఇప్పటికే ఈ సినిమా పాటలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సినిమాలో ఉన్న అఘోర వైబ్స్ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మాస్ సినిమాలు మామూలుగా ఉంటేనే థియేటర్లు అభిమానుల ఈలలు గోలలతో మారు మ్రోగిపోతుంటాయి. మరి ఒరిజినల్ సినిమా మాస్ ఫీస్ట్ అయితే థియేటర్లులో ఫ్యాన్స్ సందడి ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Read Also : “నగుమోము” వీడియో సాంగ్… మరోసారి సిద్ శ్రీరామ్ మ్యాజిక్
తాజాగా బాలయ్య అభిమానులు ‘అఖండ’ సినిమా థియేటర్లో చేసిన రచ్చకు పోలీసులు షాక్ ఇచ్చారట. అయితే అది ఇండియాలో అయితే చర్చించాల్సిన విషయమే అయినా బాలయ్య సినిమాకు ఇలా జరగడం విశేషమేమీ కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాము. ఈ సంఘటన జరిగింది ఆస్ట్రేలియాలో కావడం విశేషం. ఆస్ట్రేలియాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ యజమానులు మూవీ ఆపేసి మరీ మైకులో వార్నింగ్ ఇచ్చారట. అయినా బాలయ్య అభిమానులు ఏమాత్రం తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారట. పోలీసులు షో ఆపేసి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారట. మరి బాలయ్య సినిమా అంటే మాస్ జాతరే కదా… ఆ మాత్రం అల్లరి లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.
మరోవైపు యూఎస్ఏ లో సినిమాల ప్రీమియర్‌లు నిన్ననే ప్రీమియర్ కాగా బాలయ్య అభిమానులను ఉద్దేశించి సినిమార్క్ థియేటర్‌లో అలర్ట్ పెట్టారు. థియేటర్ సౌండ్‌ని నిర్దిష్ట డెసిబుల్స్‌కు పరిమితం చేసిందని, ఏది ఏమైనప్పటికీ సౌండ్ పెరగదని అభిమానులకు తెలుపుతూ ఓ నోటీసు అంటించడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. యూఎస్ఏలో ఒక తెలుగు సినిమాకు ఇలా జరగడం ఇదే మొదటిసారి.
