Sobhita : శోభిత ఈ నడుమ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మడు ఏం పోస్టు చేసినా దానిపై చర్చ కామన్. ఏం చెబుతుందా.. ఏం పోస్టు చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. అంతగా పోస్టులతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో పోస్టుతో ఆకట్టుకుంది. రీసెంట్ గానే అక్కినేని అఖిల్-జైనబ్ రౌవ్జీ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లిలో శోభిత, నాగచైతన్య గ్రాండ్ గా మెరిసారు.
Read Also : Vijay Devarakonda : నా ప్రతి అవార్డు వాళ్లకే సొంతం.. విజయ్ ఎమోషనల్ పోస్ట్..
ఆ ఫొటోలను ఇప్పుడు పంచుకుంది. శోభిత పోస్టులో అఖిల్ పెళ్లి భరాత్ కు ఏర్పాటు చేసిన డీజే ఫొటోను పంచుకుంది. మరో ఫొటోలో పెళ్లిలో నాగార్జునను ఆప్యాయంగా హత్తుకుంటోంది. ఇక చివరి ఫొటోలో ఓ సీక్రెట్ చెప్పింది. ఎవరేం అనుకున్నా పట్టించుకోకపోవడమే తన సీక్రెట్ అంటూ అందులో ఉంది.
ఈ పోస్ట్ కావాలనే చేసిందంటున్నారు. ఎందుకంటే మొన్న అఖిల్ పెళ్లిలో శోభిత డ్రెస్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి. నాగచైతన్య పక్కన ఆంటీలా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. వాటిపై ఈ విధంగా స్పందించిందేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి విషయంలో ఈ నడుమ సమంతతో శోభితను పోలుస్తూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. వాటికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వాలనే ఇలాంటి పోస్టు చేసిందేమో అంటున్నారు.
Read Also : The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?