కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పీడ్ చూసి యంగ్ హీరోలు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కన్నా ఇంకా ఫాస్టుగా ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నాడు. 60 ప్లస్‌లో రెస్ట్ అనే పదాన్నిపక్కన పెట్టి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ఎనౌన్స్ చేస్తున్నాడు. ఓ వైపు క్యామియోస్, మరో వైపు మెయిన్ లీడ్స్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఫైర్ ఫ్లై రీసెంట్లీ రీలీజైంది. ఇందులో కీ రోల్ చేశాడు శివన్న. అలాగే జైలర్ 2లో కూడా తన రోల్ కంటిన్యూ చేస్తున్నాడు.
Also Read : Kollywood : రెట్రోలో రక్తపాతం సృష్టిస్తోన్న కార్తీక్ సుబ్బరాజు
కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకుడిగా అవతరామెత్తి చేసిన మూవీ వీర చంద్రహాస. యక్షగానం నేపథ్యంలో సాగే మూవీలో గెస్ట్ అప్పీరియన్స్‌లో కనిపించి మెప్పించాడు శివరాజ్ కుమార్. ఇక కన్నడలో ఏ ఫర్ ఆనంద, 45, భైరవాన కోనే పాటతో పాటు మరో మూవీని చేస్తున్నాడు. తన తండ్రి జయంతి సందర్భంగా నయా ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు. ప్రముఖ దర్శకుడు, చంద్రముఖి ఫేం పీ వాసు మేనల్లుడు బాలాజీ మాధవన్ ఈ సినిమాతో ఫిల్మ్ మేకర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. వీటితో పాటు తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చేస్తున్నాడు శివన్న. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు 125 సినిమాలు కంప్లీట్ చేసిన శాండిల్ వుడ్ స్టార్ శివరాజ్ కుమార్ స్పీడ్ చూస్తుంటే 2, 3 ఇయర్స్ లో 150 మైల్ స్టోన్ చేరుకునేట్లే కనిపిస్తున్నాడు. ఇవే కాకుండా మరికొన్నికథలను కూడా వినే పనిలో ఉన్నాడు శివరాజ్ కుమార్.