Shilpa Shetty : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. అప్పట్లో అశ్లీల చిత్రాల కేసులో ఇరుక్కున్నారు శిల్పాశెట్టి దంపతులు. ఇక రీసెంట్ గా ఓ బిజినెస్ పర్సన్ ను రూ.60 కోట్ల మేర చీటింగ్ చేశారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మొన్న శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను విచారించారు. తాజాగా హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరైంది. ఆమెను పోలీసులు నాలుగు గంటల పాటు విచారించారు. తీసుకున్న డబ్బులు ఏం చేశారు, ఎక్కడ ఇన్వెస్ట్ మెంట్ చేశారు అనే కోణంలో విచారణ సాగింది. ఈ విషయంపై ఇప్పటి వరకు శిల్పాశెట్టి స్పందించలేదు. కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయి.
Read Also : MeToo: మత్తు మందిచ్చి రేప్ చేశాడు.. హీరోపై హీరోయిన్ కేసు.. అరెస్ట్!
శిల్పాశెట్టి దంపతులు దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ రీసెంట్ గా శిల్పాశెట్టి దంపతులు థాయ్ లాండ్ టూర్ కు వెళ్లేందుకు పర్మిషన్ అడగ్గా.. కోర్టు తిరస్కరించింది. ఇలా ప్రతి చోటా శిల్పాశెట్టి కుటుంబానికి చుక్కెదురు అవుతోంది. శిల్పాశెట్టి ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శల పాలు అవుతోంది. ఈ కేసుల గురించి మాత్రం స్పందించేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అప్పట్లో అశ్లీల చిత్రాల కేసు తర్వాత రాజ్ కుంద్రా ముఖం చూపించకుండా ఓ రకమైన మాస్క్ పెట్టుకుని బయట తిరిగడం సంచలనం రేపింది.
Read Also : Nidhhi Agerwal : నేరేడు పళ్ళు.. నిధి అగర్వాల్ కళ్ళు.. హాట్ ఫొటోస్