టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ లో ఎన్టీఆర్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బొద్దుగా ఉన్నా, సన్నగా మారినా ఎన్టీఆర్ డాన్స్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఎంతటి కష్టమైన స్టెప్ అయినా అవలీలగా వేసేస్తాడు. ఇక ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే హీరోయిన్లతో పాటు కొరియోగ్రాఫర్లు కూడా భయపడుతుంటారు. అయితే ఎంతటి బెస్ట్ డ్యాన్సర్ అయినా రిహార్సల్స్ చేయాల్సిందే. స్క్రీన్ మీద తడబడకుండా అన్ని స్టెప్పులు గుర్తుపెట్టుకొని చేయాలంటే ముందు రిహార్సల్స్ లో తప్పకుండా పాల్గొంటారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు రిహార్సల్స్ యే చేయలేదట. ఏ ఒక్క సాంగ్ కు రిహార్సల్స్ చేయకుండానే సెట్ లోకి వచ్చేవాడట. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
మన స్టార్స్ లో తక్కువ రిహార్సల్స్ చేసేది ఎవరు..? అని యాంకర్ అడగగా.. “ఎన్టీఆర్.. ఆయన ఇప్పటివరకు రిహార్సల్స్ కు రాలేదండి.. డైరెక్ట్ గానే చేసేస్తారు” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఒక్క మాటతో ఎన్టీఆర్ ఎంత గొప్ప డ్యాన్సరో అర్ధం చేసుకోవచ్చు. మొదటి నుంచి ఎన్టీఆర్ కు డ్యాన్స్ అంటే ఇస్తామన్న విషయం అందరికి తెలిసిందే. తారక్ తల్లి షాలినికి ఎన్టీఆర్ గొప్ప నృత్య కళాకారుడు కావాలని కోరిక ఉండేదట. అందుకే చిన్నప్పుడే తారక్ కు కూచిపూడి తో సహా అన్ని రకాల డాన్స్ లను నేర్పించింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.