Shefali Shah: బాలీవుడ్ నటి షెఫాలీ షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ క్రైమ్, డార్లింగ్స్, జల్సా, హ్యూమన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో మరింత పేరు తెచ్చుకుంది. రంగీలా సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి, 1999లో విడుదలైన సత్య సినిమాలో నటనకుగాను ఉత్తమ నటి విభాగంలో ఫిలింఫేర్ అవార్డును మరియు 2009లో విడుదలైన ది లాస్ట్ లీర్ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తాజాగా ఆమె .. ఒక ఇంటర్వ్యూలో ఆమె తన సినిమాల గురించి చెప్పుకొచ్చింది.
Bhanu Sri Mehra: బిగ్ బాస్ ఒక చెత్త షో.. అల్లు అర్జున్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
షెఫాలీ షా.. 2005లో రిలీజైన వఖ్త్: ద రేస్ ఎగైనెస్ట్ టైమ్ మూవీలో అక్షయ్ కుమార్‌కి తల్లిగా నటించింది. అక్షయ్ కన్నా షెఫాలీ నాలుగేళ్లు చిన్నది. స్టార్ హీరోలకు తల్లిగా నటించేవారి నటిమణుల వయస్సు తక్కువే ఉన్నా కూడా తప్పక ఒప్పుకోవాల్సిన పరిస్థితి వారిది. ఇక ఈ విషయమై షెఫాలీ మాట్లాడుతూ.. ” నేను చచ్చినా ఇంకోసారి అక్షయ్ కు తల్లిగా నటించను. 25 ఏళ్లుగా వస్తున్న అవకాశాల కన్నా.. నాలుగైదేళ్లుగా నాకు అవకాశాలు బాగా వస్తున్నాయి. నాకు ఆ జనరేషన్ లో అంటే.. షారుక్, అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. వారు అప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పటికీ స్టార్సే. కానీ, నేనెప్పుడూ స్టార్ యాక్టర్ అవ్వాలని కోరుకోవడం లేదు. ఇప్పుడు నాకు ఉన్నదాంతో నేను హ్యాపీగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుత, ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.