Tunisha Sharma Suicide Case: బాలీవుడ్ నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డిసెంబర్ 24, 2022న తునీషా సెట్స్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు కారణం ఆమె ప్రియుడు షీజాన్ ఖాన్ అని.. నటి తల్లి ఆర్పించడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్, అంతకుముందు వారి మధ్య ఏం జరిగింది అనేది విచారిస్తున్నారు. ఇక నటి తల్లి.. తన కూతురు ప్రియుడు షీజానే తన కూతురు మృతికి కారణమని చెప్తుండగా.. షీజాన్ కుటుంబ సభ్యులు తునీషా తల్లే ఆమెను చంపేసిందని ఘాటు ఆరోపణలు చేశారు.
సోమవారం మీడియా ముందుకు వచ్చిన వారు మాట్లాడుతూ.. ” కూతురు చనిపోయిందని ఇప్పుడు ఏడుస్తున్న ఆమె.. స్వయంగా కూతురును చంపాలనుకొంది. తునీషా మామగా చెప్పుకుంటున్న సంజీవ్ కౌశల్ కు, ఆమె తల్లికి మధ్య ఏదో సంబంధం ఉందని,అది షీజాన్ కు తెలిసి ప్రశ్నించడంతో ఆమె, అతడిపై కక్ష కట్టింది. తునీషాకు ఇష్టంలేని పనులను వీరిద్దరూ కలిసి ఎన్నో చేయించారు. కరోనా లాక్స్ డౌన్ సమయంలో ఆమెకు ఇష్టం లేకుండా చండీఘర్ కు పంపించాలని చూశారు. తునీషా వెళ్ళను అని గట్టిగా చెప్పడంతో ఆమెను కొట్టి, ఫోన్ పగులకొట్టి.. గొంతుకోసి చంపాలనుకున్నారు. ఈ విషయాన్నీ తునీషా, తను నటిస్తున్న షో డైరెక్టర్ తో చెప్పుకొని బాధపడింది. ఇవన్నీ ఆమె కప్పిపుచ్చడానికి కూతురిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది” అని వారు చెప్పుకొచ్చారు. మరి ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసులో చివరికి ఎవరికి న్యాయం జరుగుతుందో చూడాలి.