Sharwanand: ఇండస్ట్రీలో అందరికి స్నేహితులు ఉంటారు. కానీ, కొంతమందే ప్రాణ స్నేహితులుగా మారతారు. ముఖ్యంగా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో శర్వానంద్- రామ్ చరణ్ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరితో పాటు రానా.. అయితే రానా వీరికి సీనియర్ కావడంతో కొంతవరకు భయపడేవారని శర్వా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక చరణ్- శర్వా ల స్నేహం.. చిన్నతనం నుంచి పెరుగుతూ వచ్చింది. ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అంటే వీరి గురించే చెప్పుకోస్తారు. ఇక చరణ్ ఫ్రెండ్ స్ అంటే ప్రాణం ఇస్తాడు. శర్వాకు ఏది కావాలన్నా ముందు ఉండి చేస్తాడు. అలానే శర్వానంద్ పెళ్ళి కూడా చరణ్ తన చేతుల మీదనే చేయించాడు. తాజాగా చరణ్ గురించి శర్వానంద్.. ఉస్తాద్ షోలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అతడి స్నేహం దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. అలాంటి స్నేహితుడు దొరకడం తాను చేసుకున్న పుణ్యం అని చెప్పుకొచ్చాడు.
మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ షోలో శర్వానంద్ సందడి చేశాడు. చిన్నప్పటి నుంచి చరణ్, మనోజ్, శర్వానంద్ మంచి ఫ్రెండ్స్. ఇక వీరి చిన్నతనం తాలూకు జ్ఞాపకాలతో షో అంతా నిండిపోయింది. చరణ్ గురించి శర్వానంద్ మాట్లాడుతూ.. ” చిరంజీవి గారు ఎంత గొప్పవారో, పక్కన వాళ్ళందరిని ఎలా చూసుకుంటారో.. సమె ఆ క్వాలిటీస్ , ఆ ప్రేమ ఇచ్చే విధానం కానీ, ఒక మనిషికి అవసరం వస్తే ఉండే విధానం కానీ, ఈరోజు నేనిలా ఉన్నా అంటే చరణ్ లాంటి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అని నేను గర్వంగా చెప్పుకోగలను. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను చరణ్ లాంటి ఒక ఫ్రెండ్ నాకు దేవుడు ఇచ్చినందుకు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.