Sharukh Khan: ప్రపంచంలో బాగా సంపాదించేవారిలో చిత్ర సీమకు సంబంధించిన వాళ్లు కూడా ఉంటారు. భారీ సినిమాలకు కొందరు నటులు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో వరల్డ్ రిచెస్ట్ నటుల జాబితాను ట్విట్టర్ ఆఫ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ రిపోర్టు వెల్లడించింది. ఈ జాబితాలో టాప్-5లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. షారుఖ్ నుంచి నాలుగేళ్లుగా సినిమా రాలేదు. బ్రహ్మాస్త్రలో అతిథి పాత్రలో నటించినా అది అతడి ఖాతాలో రాదు. అయితే సంపాదన విషయంలో మాత్రం షారుఖ్ తగ్గేదేలే అంటున్నాడు. రూ.6,300 కోట్లకు పైగా సంపదతో ప్రపంచంలోనే అతడు రిచెస్ట్ యాక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో పలువురు హాలీవుడ్ నటులను కూడా షారుఖ్ వెనక్కి తోసేశాడు. హాలీవుడ్ హీరోలు టామ్ క్రూజ్, డ్వైన్ జాన్సన్ లాంటి వాళ్లు కూడా షారుఖ్ వెనకే ఉండటం గమనించాల్సిన విషయం.
Read Also: Jaya Bachchan: చెప్పింది అర్థం కావట్లేదా.. నా ఫోటోలు తీయొద్దు.. మండిపడ్డ అమితాబ్ భార్య
వరల్డ్ రిచెస్ట్ నటుల్లో అగ్రస్థానంలో అమెరికన్ స్టాండప్ కమెడియన్ జెర్రీ సీన్ ఫెల్డ్ ఉన్నాడు. అతడి సంపద 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఉంది. మరో హాలీవుడ్ నటుడు టైలర్ పెర్రీ కూడా 1 బిలియన్ డాలర్ల సంపదతో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో 800 మిలియన్ డాలర్లతో రాక్ డ్వైన్ జాన్సన్ నిలిచాడు. నాలుగో స్థానంలో షారుఖ్ ఖాన్ ఉండగా.. ఐదో స్థానంలో రూ.5వేల కోట్లతో హాలీవుడ్ సూపర్ హీరో టామ్ క్రూజ్ కొనసాగుతున్నాడు. అటు జాకీ చాన్ 4 వేలకోట్ల రూపాయలతో 6వ స్థానంలో, జార్జ్ క్లూనీ 4 వేల కోట్ల సంపదతో 7వ స్థానంలో ఉన్నారు. వరల్డ్ రిచెస్ట్ యాక్టర్ల జాబితాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కాగా ఫోర్బ్స్ అంచనాల ప్రకారం.. షారుఖ్ యావరేజ్ ఏడాది సంపాదన కనీసం రూ.300 కోట్లకు పైగా ఉంటుందని స్పష్టమైంది. షారుఖ్ ఖాతాలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ కూడా ఉంది.