Shanmukh Jaswanth Comments on Deepthi Sunaina: బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఇద్దరికీ యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షాట్స్ చేస్తూ క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత ముందు దీప్తి బిగ్ బాస్ లో అడుగు పెట్టి బాగా ఫేమస్ అయ్యింది. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా కూడా అయ్యారు అప్పట్లో. ఇక షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ బాస్ దీప్తి సునైనా బ్రేకప్ అయినా అప్పుడప్పుడు ఒకరినొకరు గుర్తుచేసుకుంటూనే ఉండేలా చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా ప్రేమికుల రోజు కూడా జరిగిన క్రమంలో జశ్వంత్ దీప్తి సునైనాతో బ్రేకప్ పై మరోసారి స్పందించాల్సి వచ్చింది.
Bhoothaddam Bhaskar Narayana: శివ ట్రాన్స్.. దేవుడే పూనేట్టు ఉన్నాడే
అసలు విషయం ఏమిటంటే వాలెంటైన్స్ డే సంధర్భంగా తన అభిమాని అడిగిన ప్రశ్నకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్. బ్రేకప్ అయినా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావో చెప్పు బ్రో అంటూ షణ్ముఖ్ ఫ్యాన్ ఒకరు అడగగా పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ పాట లిరిక్స్ ను ఆన్సర్ గా ఇచ్చాడు షన్ను. ‘కోరుకున్నది చేయి దాటిపోతే వెళ్లిపోనిలే.. బాధపడటం బెంగ పడిపోవడం మనకి రాదసలే’ అంటూ బదులివ్వడం హాట్ టాపిక్ అయింది. ఇలా నేరుగా దీప్తిసునైనాతో బ్రేకప్ పైనే స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక చివరిగా ‘స్టూడెంట్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు షన్ను. మరోపక్క దీప్తి కొన్ని సాంగ్స్ చేస్తోంది.