Nagababu: శంకర్ దాదా MBBS రీరిలీజ్ ట్రైలర్.. ఆయన ఇప్పుడు లేరు.. బాధగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు మెగా ప్రొడక్షన్స్ ద్వారా నాగబాబు నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీరిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ.. “ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతుంటుంది. టీవీ, యూట్యూబ్‌లో పాత సినిమాలను చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు థియేటర్లో రిపీటెడ్ రన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, చానెళ్లకు సినిమాలు వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలి. మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. అప్పుడు అన్నయ్య గారు ఎంతో అందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో అలా వస్తే చిన్న సీన్ చేయించారు. వైష్ణవ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. నా ఫ్రెండ్ ఆహుతి ప్రసాద్ ఇప్పుడు లేరు. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి” అని తెలిపాడు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. నేను హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ గురించి వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా? అని చిరంజీవి గారిని అడిగాను. నవ్వి వదిలేశారు. చివరకు ఆ పాత్ర నాకు వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడేతత్త్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ.. “శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. వెస్ట్ గోదావరి ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ టైంలో నాకు ఎంతో లాభాన్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమాతోనే నాకు మెగా డిస్ట్రిబ్యూటర్ అనే పేరు వచ్చింది. అలాంటి సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతుండటం నాకు ఆనందంగా ఉంది” అని తెలిపాడు.
ధర్మేంద్ర మాట్లాడుతూ.. “నాగబాబు గారు మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. శ్రీకాంత్ గారు మాకు ఎప్పుడూ ఏటీఎం లాంటి వారే. నవంబర్ 4న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని అన్నాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..