Nagababu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది.