ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఎన్ని సినిమాలు తీసాం అన్నది ముఖ్యం కాదు. ఒక పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది అనేది ముఖ్యం. అలా ఫేమ్ అందుకున్న చిన్న హీరోయిన్‌లు చాలా మంది ఉన్నారు అందులో ‘ఆరెంజ్’ మూవీ హీరోయిన్ షాజన్ పదంసీ ఒక్కరు. ఈ మూవీలో రుబా పాత్రలో నటించింది. రామ్ చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అందమైన ప్రేమకథగా వచ్చి బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మ్యూజిక్ పరంగా హరీశ్ జయరాజ్ అందించి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ హిట్ అని చెప్పాలి.
రామ్ చరణ్ కి జోడిగా జెనీలియా నటించింది.. వీరిద్దరి కెమిస్ట్రీ యూత్‌కి విపరీతంగా నచ్చేసింది. ఇక ఈ సినిమాలో రుబా పాటతో చాలా ఫేమస్ అయిన హీరోయిన్ షాజన్ పదంసీ. ఈ సినిమాలో చరణ్ లవ్ స్టోరీ లో కనిపిస్తుంది. ఒక పాట తో కుర్రకారును బాగా ఆకట్టుకుంది రుబా. ఈ మూవీ తర్వాత కూడా మంచి ఆఫర్‌లు అందుకుంది షాజన్. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేదు. స్కిన్ షో చేసి నటించిన కూడా లాభం లేకుండా పోయింది.
ఇక తాజాగా షాజన్ పదంసీ తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి. తన ప్రియుడు ఆశిష్ ఒక వ్యాపారవేత్త. ఈ మేరకు ఫోటోస్ షేర్ చేస్తూ.. జనవరి 20న కొత్త ప్రయాణం స్టార్ట్ అయ్యింది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌లోనే అశీష్ తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలు షేర్ చేసింది.. కాగా వివాహం త్వరలో జరగనుంది.