సలార్ సినిమా సోలోగా వస్తే బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయ్ కానీ కావాలనే షారుఖ్ ఖాన్ సినిమాకు పోటీగా సలార్ రిలీజ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డంకీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి… ఇప్పటివరకైతే సలార్ వర్సెస్ డంకీ వార్ పీక్స్‌లో ఉంటుందని నార్త్, సౌత్ ఇండస్ట్రీలు ఫిక్స్ అయిపోయాయి. అయితే డంకీ డేట్‌పై ఇంకాస్త క్లారిటీ రావాలంటే… మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నవంబర్ 2న డంకీ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ కట్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా రెండు టీజర్స్ కట్ చేశారని… ఒకటి 58 సెకన్లు, మరోటి 109 సెకన్ల రన్ టైం లాక్ చేశారట. ఇందులో ఏదో ఒక టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు టాక్.
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు జస్ట్ పోస్టర్స్ మాత్రమే బయటికొచ్చాయి. ఒక్కసారి టీజర్ రిలీజ్ అయితే సినిమా కథ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే… డంకీ టీజర్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సలార్ టీజర్ దెబ్బకు డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలయ్యాయి. డైనోసర్ అంటూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇలాంటి సినిమాతో క్లాష్‌కు రెడీ అవుతున్న డంకీ టీజర్.. ఎలా ఉంటుందనేది ఎగ్జైటింగ్‌గా మారింది. మరి ఒక్క రోజు గ్యాప్‌లో డిసెంబర్ 21, 22న రానున్న డంకీ, సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.