ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ మూడో వారంలో జరగబోతుంది. ఒక్క రోజు గ్యాప్ లో కింగ్ ఖాన్, డైనోసర్ తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. దీంతో క్లాష్ ఆఫ్ టైటాన్స్ రేంజులో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంది. ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ వెర్బల్ వార్ కి కూడా దిగారు. ఫామ్ లో ఉన్న కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు అంటుంటే సలార్ దెబ్బకి డంకీ సినిమా గల్లంతవుతుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు డంకీ సలార్ సినిమాల్లో ఏ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది? ఎన్ని కోట్లు రాబడుతుంది అనే విషయం తెలియాలి అంటే డిసెంబర్ 21-22 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
ఈ ఎపిక్ బాక్సాఫీస్ ఫైట్ లో మరింత హీట్ పెంచడానికి సలార్ నుంచి ట్రైలర్… డంకీ నుంచి డ్రాప్ 2 బయటకి వస్తున్నాయి. సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది, దీంతో సలార్ ట్రైలర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపొయింది. సోషల్ మీడియా అంతా సలార్ మేనియాలో ఉండగా డంకీ ట్రెండింగ్ లోకి వచ్చింది. డంకీ డ్రాప్ 2 నవంబర్ 22న రిలీజ్ కానుంది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. డంకీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు కానీ సలార్ ట్రైలర్ కౌంట్ డౌన్ ట్రెండ్ అవుతున్న టైమ్ లో డంకీ డ్రాప్ 2 ట్రెండ్ అవ్వడం చూస్తుంటే బాక్సాఫీస్ వార్ కి ఈ ప్రమోషనల్ కంటెంట్ లే పునాదులు అయ్యేలా ఉన్నాయి. మరి ఈ వార్ కి షారుఖ్ గెలుస్తాడా లేక ప్రభాస్ గెలుస్తాడా అనేది చూడాలి.