Shah Rukh : ‘దిల్ సే’ నుంచి ‘ఓం శాంతి ఓం’ వరకు.. షారుఖ్ బర్త్‌డే రీ-రిలీజ్ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ త్వరలో తన 60వ పుట్టినరోజు (నవంబర్ 2) జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో అభిమానుల కోసం ఆయన ఒక విశేషమైన బహుమతిని ప్లాన్ చేసారు. “షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్” పేరుతో ఆయన నటించిన సూపర్‌హిట్ సినిమాలను అక్టోబర్ 31 నుంచి థియేటర్లలో మళ్లీ ప్రదర్శించబోతున్నారు. ఈ ఫెస్టివల్లో షారుఖ్ కెరీర్‌లోని ప్రఖ్యాత సినిమాలు మళ్లీ థియేటర్ల స్క్రీన్‌పై వస్తాయి. వీటిలో “దిల్ సే”, “దేవదాస్”, “మై హూ నా”, “ఓం శాంతి ఓం”, “చెన్నై ఎక్స్‌ప్రెస్” వంటి చిత్రాలు ముఖ్యంగా ఉన్నాయి. ప్రతి సినిమా తన ప్రత్యేకమైన శైలి, కథనాలతో అభిమానులను అలరిస్తుంది.
Also Read : Janhvi Kapoor : ‘శారీరక సుఖాలు తప్పుకాదు’ వ్యాఖ్యలతో టాక్ షోలో తలపడ్డ స్టార్ హీరోయిన్లు..
Also Read
ఈ సందర్భంగా షారుఖ్ మాట్లాడుతూ.. “నా పాత్రలు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. నేను మారలేదు, కేవలం జుట్టు కొంచెం స్టైలిష్‌గా మారింది. ఈ ఫెస్టివల్ ద్వారా అభిమానులతో మళ్లీ ఆ బంధాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు. ఫెస్టివల్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు భారత్‌లోని పీవీఆర్-ఐనాక్స్ థియేటర్లు, అలాగే ఉత్తర అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ దేశాల్లో యశ్‌రాజ్ ఫిల్మ్స్ (YRF) సహకారంతో ప్రదర్శించబడుతుంది. ఇక షారుఖ్ ప్రస్తుతం “కింగ్” చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్లో హీరోయిన్గా ప్రవేశించనున్నారు. షారుఖ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా అభిమానులు షారుఖ్ కెరీర్‌లోని ఐకానిక్ సినిమాలను మళ్లీ పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం వస్తుంది.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!