బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ త్వరలో తన 60వ పుట్టినరోజు (నవంబర్ 2) జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో అభిమానుల కోసం ఆయన ఒక విశేషమైన బహుమతిని ప్లాన్ చేసారు. “షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్” పేరుతో ఆయన నటించిన సూపర్‌హిట్ సినిమాలను అక్టోబర్ 31 నుంచి థియేటర్లలో మళ్లీ ప్రదర్శించబోతున్నారు. ఈ ఫెస్టివల్‌లో షారుఖ్ కెరీర్‌లోని ప్రఖ్యాత సినిమాలు మళ్లీ థియేటర్‌ల స్క్రీన్‌పై వస్తాయి. వీటిలో “దిల్ సే”, “దేవదాస్”, “మై హూ నా”, “ఓం…