Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మించగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 14 న 3డీలో శాకుంతలం అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సమంత.. ప్రమోషన్ల జోరును పెంచేసింది.ఒక పక్క వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూనే .. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా హైప్ తీసుకొచ్చేస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. శకుంతల- దుష్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆయన పడిన తపన, కృషి అన్ని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తున్నాయి.
Ravanasura: ఈ పాట వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయే
ఋషివనంలో చెలికత్తెలతో ఆడుకుంటూ కాలం గడుపుతున్న శకుంతలను వేటకొచ్చిన దుష్యంత మహారాజు మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ ప్రేమమాయలో శకుంతల గర్భవతి అవుతుంది. ఇంకోపక్క ఒక ప్రమాదంలో దుష్యంతుడు తన గతాన్ని మర్చిపోతాడు. అప్పటినుంచి శకుంతలకు కష్టాలు మొదలవుతాయి. తన భర్తకు గతాన్ని గుర్తుచేసి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని ఎలా పరిచయం చేసింది..? ప్రేమతో ఆమె గెలిచిన మనసులు ఎన్ని..? పడిన అవమానాలు ఏంటి..? అనేది ఈ సినిమాలో చూపించాడు గుణశేఖర్. శకుంతలగా సామ్ నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. ఇక దుష్యంతుడుగా దేవ్ ఎంతో చక్కగా సరిపోయాడు. సినిమాకు బలం ఏదైనా ఉంది అంటే అది నేపధ్య సంగీతం. మణిశర్మ సినిమాకు ప్రాణం పోశాడు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. మరి ఈ సినిమా ఎలాంటి విఏజెన్నీ అందుకుంటుందో చూడాలంటే మరో వారం ఆగాల్సిందే.