సైఫ్ అలీఖాన్ గారాల పట్టి సారా అలీఖాన్ ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్లవుతున్నా సరైన గుర్తింపు దక్కలేదు. ఖాతాలో మంచి హిట్స్ ఉన్నా స్టార్ డమ్‌కు ఆమడ దూరంలో ఆగిపోతోంది. సారాతో పాటుగా కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వీ, అనన్యా పాండేలు బాలీవుడ్ టు టాలీవుడ్ చక్కర్లు కొట్టేస్తే మేడమ్ మాత్రం బీటౌన్ చూరు పట్టుకుని వేళాడుతోంది. సెవెన్ ఇయర్స్‌గా బిగ్ సెలబ్రిటీ స్టేటస్ కోసం శ్రమిస్తున్నాఫలితం దక్కడం లేదు.
Also Read : VD 12 : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ.?
ఫస్ట్ సినిమా కేథరనాథ్‌తో సూపర్ ఫెర్మామర్ అనిపించుకున్న సారా సింబా, లవ్ ఆజ కల్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఇంకేముంది మేడమ్ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారు కానీ కరోనా సారా అలీఖాన్ కొంప ముంచింది. ఎక్కువగా ఓటీటీల్లోనే పలకరించడంతో సారా క్రేజ్ అమాంతం పడిపోయింది. ఓటీటీలో మూవీస్ చేశాక జరా హట్కే జరా బచ్కేతో కం బ్యాక్ హిట్ అందుకున్నాక కూడా మళ్లీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వైపు మొగ్గు చూపింది. ఓటీటీ అప్పీరియన్స్ ఎక్కువ కావడం థియేటర్ ఫెర్మామెన్స్ తగ్గిపోవడంతో సారాకు సరైన ఐడెంటిటీ రావట్లేదు. ఇప్పుడు ఫెలో భామల జోరు చూశాక కళ్లు తెరిచిన సారా ఇప్పుడు థియేటర్ సినిమాలపై కాన్షట్రేషన్ చేస్తోంది. రీసెంట్లీ స్కై ఫోర్స్‌లో కనిపించిన సారా అలీఖాన్ ప్రజెంట్ మెట్రో ఇన్ దినోలో పార్ష్ గర్ల్‌గా కనిపించబోతుంది. అలాగే ఆతంగ్రి రే డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్‌తో ఓ మూవీకి కమిటయ్యింది. ఇటు థియేటర్ పై ఫోకస్ చేస్తూనే అటు ఓటీటీ కోసం షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేయబోయే సినిమాకు సారా సైన్ చేసినట్టు సమాచారం.