విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ లుక్ కు మేకోవర్ అయ్యాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : SURIYA : స్టార్ దర్శకులతో సినిమాలు క్యాన్సిల్ చేస్తున్న సూర్య..
కాగా కింగ్‌డమ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కావడంతో రిలీజ్ వాయిదా పడింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా మరొక కారణం అని చెప్పక తప్పదు. ఇక ఆ మధ్య కింగ్డమ్ ను జులై 4న రిలీజ్ చేస్తామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావడం లేదు. అదే డేట్ కు పవర్ స్టార్ హరిహర వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు లేటెస్ట్ గా మరో డేట్ వినిపిస్తుంది. కింగ్డమ్ ను జులై 25న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే హరిహర వీరమల్లు కారణంగా వెనక్కి వెళుతూ ఉన్నవిజయ్ దేవరకొండ ఈ సారి అయినా అనుకున్న డేట్ కు వస్తాడో లేదో. అలా రావాలంటే ముందు హరిహర విడుదల అవ్వాలి. మరి ఈ రిలీజ్ పంచాయితీ ఎప్పుడు తీరుతుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.