Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Servant Eeshwari Blame Aishwarya Rajinikanth For Not Increasing Her Salary: సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరగడం, ఇంట్లో పని చేసే ఈశ్వరి అనే పనిమనిషే ఈ దొంగతనానికి పాల్పడటం, మార్చి 31వ తేదీన పోలీసులు ఆమెను పట్టుకోవడం.. అంతా తెలిసిందే! ఈశ్వరిని పట్టుకున్న అనంతరం ఈ దొంగతనం ఎందుకు చేశావని పోలీసులు విచారించగా.. దిమ్మతిరిగే వాంగ్మూలం ఇచ్చింది. ఐశ్వర్య చాలా పెద్ద పిసినారి అని, 18 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ జీతం పెంచడం లేదన్న కోపంతోనే ఈ దొంగతనానికి పాల్పడ్డానంటూ బాంబ్ పేల్చింది.
Gold Theft : నగలు చూస్తున్నట్లు నాటకం.. 15తులాల బంగారం చోరీ
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
పోలీసుల విచారణలో ఈశ్వరి మాట్లాడుతూ.. ‘‘నేను గత 18 ఏళ్లుగా ఐశ్వర్య ఇంట్లో పని చేస్తున్నాను. ఐశ్వర్య పిల్లల బాగోగులతో పాటు మరెన్నో పనులు చూసుకుంటున్నాను. వాళ్లు చెప్పిన ప్రతీ చిన్న పని చేస్తూనే వస్తున్నాను. అయినా సరే.. వాళ్లు నాకు నెలకు కేవలం రూ.30 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారు. వాళ్ల దగ్గర ఎంతో డబ్బున్నా.. నాకు మాత్రం జీతం పెంచలేదు. ఈ రూ.30 వేలతో నేను ఎలా బ్రతకాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? తమ అవసరాల కోసం ఎంతో ఖర్చు చేసుకుంటారు కానీ, ఇంట్లో వాళ్ల పనులన్నీ చేసి పెడుతున్న నాకు మాత్రం జీతం పెంచట్లేదు. జీతం తక్కువగా ఇస్తున్నారనే కోపంతోనే.. దొంగతనం చేశాను. ఒకవేళ నా పనికి తగ్గ మంచి జీతం ఇచ్చి ఉంటే, దొంగతనం ఎందుకు చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. మొదట తాను చిన్న చిన్న దొంగతనాలు చేసేదాన్నని, అప్పుడు దొరికిపోలేదని తెలిపింది. ఆ ధైర్యంతోనే ఈసారి నగలు దొంగలించానని కుండబద్దలు కొట్టింది.
CM KCR Live.. Emotional Speech : నాజీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశా
కాగా.. ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పనిమనిషి ఈశ్వరి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా.. 100 బంగారం ముక్కలు, 30 గ్రాముల డైమండ్ ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తులు లభ్యమయ్యాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. తన కంప్లైంట్‌లో ఐశ్వర్య ఇచ్చిన ఆభరణాల లిస్ట్‌లో కంటే, ఈశ్వరి ఇంట్లో ఎక్కువ నగలు దొరికాయి. వీటిని చూశాక.. గతంలో ఈశ్వరి చేసిన చిన్న చిన్న దొంగతనాల బాగోతం కూడా బయటపడింది. అంతేకాదు.. ఈశ్వరికి చెన్నైలోని షోలింగనల్లూరు ప్రాంతంలో రూ.1 కోటి విలువ చేసే ఇల్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు