Gold Theft : నగలు చూస్తున్నట్లు నాటకం.. 15తులాల బంగారం చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Theft : నగలు చూడడానికి వచ్చి బంగారం షాపులో చోరీకి పాల్పడిన ఘటన బారామతి తాలూకాలోని సూపేలో చోటుచేసుకుంది. ఆభరణాలు దోచుకెళ్లి దుండగులు పారిపోవాలనుకున్న సమయంలో.. గందరగోళం నెలకొనడంతో నిందితులు కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, ఒకరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గ్రామస్తులు ఒకరిని పట్టుకోగా, ముగ్గురు నిందితులు తప్పించుకోగలిగారు.
సుయాష్ సునీల్ జాదవ్‌కు బారామతి తాలూకాలోని సూపే వద్ద మార్కెట్ చౌరస్తా సమీపంలో మహాలక్ష్మి జ్యువెలర్స్ షాపు ఉంది. ఈ దుకాణానికి నలుగురు వ్యక్తులు పవన్ విశ్వకర్మ, సాగర్ దత్తాత్రే చంద్‌గూడే, అశోక్ భాగుజీ బోర్కర్, సుశాంత్ క్షీరసాగర్ వచ్చారు. నగలు కొనుగోలు చేసినట్లు నటించారు. ఈ సందర్భంగా నగలు చూస్తానన్న సాకుతో నలుగురూ షాపులోని 15 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బంగారాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగులు కాల్పులు జరిపారు.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
Read Also: Summer Season: దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న ఎండలు.. సాధారణం కన్నా అధికం.. ఐఎండీ హెచ్చరిక
దుకాణం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. బయట నిలబడిన సాగర్ చందగూడే దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో దుండగుడు కాల్చాడు. దీంతో చందాగూడేకి గాయాలయ్యాయి. అశోక్ బోర్కర్ కడుపులో రెండు బుల్లెట్లు దూసుకుపోగా, సుశాంత్ క్షీరసాగర్ కాలికి తగిలింది. ఈ ఘటనపై సూపీ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు నాయక్ దత్తాత్రయ్ ధుమాల్, నజీర్ రహీమ్ షేక్, రాజ్ కుమార్ లవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also:Huge Rat: జీవితంలో ఇంత పెద్ద ఎలుకను ఎప్పుడూ చూసి ఉండరు
దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. గ్రామస్తులు వారిలో ఒకరిని పట్టుకోగా, ముగ్గురు పరారయ్యారు. ఘటనా స్థలాన్ని అప్పర్ సూపరింటెండెంట్ ఆనంద్ భోయిటే, డివిజనల్ పోలీసు అధికారి గణేష్ ఇంగ్లే సందర్శించారు. తదుపరి విచారణను అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సచిన్ కాలే, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సలీం షేక్ నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!